హౌదీ మోదీ సభకు ట్రంప్‌

16-09-2019

హౌదీ మోదీ సభకు ట్రంప్‌

ఈ నెల 22న అమెరికాలోని హ్యూస్టన్‌లో జరగనున్న హౌదీ మోదీ సభకు డోనాల్డ్‌ ట్రంప్‌ వస్తారని శ్వేతసౌధం సృష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. తన ట్విట్టర్‌లో ఆయన విషయంపై స్పందించారు. హౌదీ మోదీ సభకు ట్రంప్‌ రావడం ప్రత్యేకమైందన్నారు భారత్‌, అమెరికా మధ్య ఉన్న ప్రత్యేక స్నేహబంధాన్ని సూచిస్తుందన్నారు. భారతీయ సంతతి ప్రజలు నిర్వహించే ఆ కార్యక్రమానికి ట్రంప్‌ను ఆహ్వానించేందుకు ఆస్తికగా ఉన్నట్లు మోదీ తన ట్విట్‌లో తెలిపారు. ట్రంప్‌ రాక.. అమెరికా ఆర్థిక వ్వవస్థ బలోపేతానికి భారతీయులు అందిస్తున్న భాగస్వామ్యాన్ని గుర్తిస్తుందని అన్నారు.