భారత్‌, అమెరికా జవాన్లు ‘యుధ్ అభ్యాస్’ మాక్‌ డ్రిల్స్‌

16-09-2019

భారత్‌, అమెరికా జవాన్లు ‘యుధ్ అభ్యాస్’ మాక్‌ డ్రిల్స్‌

యుధ్‌ అభ్యాస్‌ ను పురస్కరించుకొని భారత్‌, అమెరికా జవాన్లు మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించారు. వాషింగ్టన్‌ లోని జాయింట్‌ బేస్‌ లెవిస్‌- ఎంసీచొర్డ్‌ లో ఫిజికల్‌ డ్రిల్‌ ను చేపట్టారు. అసోం దళాల మార్చ్‌ ఫాస్ట్‌ సాంగ్‌ బద్‌ లు రామ్‌ కా బదన్‌ జమీన్‌ కే నీచే హై కు జవాన్లు డ్యాన్స్‌ చేశారు. రెండు దేశాల సైనికబలగాల మధ్య ఫిజికల్‌ డ్రిల్‌ ఆద్యంతం ఉత్కంఠగా ఈ డ్రిల్‌ సాగింది. భారత్‌-అమెరికాల మధ్య రక్షణపరమైన సంబంధాలను బలోపేతం చేసే దిశగా సెప్టెంబర్‌ 5 నుంచి 18 వరకు యుధ్‌ అభ్యాస్‌ కొనసాగనుంది.