అమెరికాలో మరో ఇన్ఫోసిస్‌ ఇన్నోవేషన్‌ హబ్‌

16-09-2019

అమెరికాలో మరో ఇన్ఫోసిస్‌ ఇన్నోవేషన్‌ హబ్‌

అమెరికాలో 6వ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఇన్ఫోసిస్‌ ప్రారంభించింది. 2023 నాటికి 1000 మంది అమెరికన్‌ ఉద్యోగులను నియమించుకోవడమే లక్ష్యంగా ఈ సెంటర్‌ను ప్రారంభించింది. అటానమస్‌ టెక్నాలజీస్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌, పుల్‌-స్టాక్‌ ఇంజనీరింగ్‌, డేటా సైన్స్‌, సైబర్‌ క్రైమ్‌పై ఈ నూతన కేంద్రం దృష్టి సారించనుంది. రానున్న త్రైమాసికాల్లో ఉద్యోగులను నియమించుకోవాలని ఇన్ఫోసిస్‌ యోచిస్తోంది. 2023 నాటికి వెయ్యి మంది అమెరికన్లను ఉద్యోగులుగా నియమించుకోవడమే మా లక్ష్యం. ఈ మేరుకు ఇదివరకే ప్రకటన చేశాం. ఇప్పటికే 10 వేల మందికిపైగా ఉద్యోగులను నియమించుకున్నాం. అమెరికన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆవిష్కరణలను పెంచేవిధంగా ప్రస్తుత ప్రయత్నాలు కొనసాగుతున్నాయిన ఇన్ఫోసిస్‌ ప్రకటించింది.