పాక్‌కు మరో ఎదురుదెబ్బ

16-09-2019

పాక్‌కు మరో ఎదురుదెబ్బ

కాశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్తామంటూ పాకిస్థాన్‌ చేస్తున్న ప్రకటనలపై బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యుడు బాబ్‌ బ్లాక్‌మెన్‌ తీవ్రంగా స్పందించారు. కాశ్మీర్‌ భారత్‌లో అంతర్బాగమని వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌ విషయంలో ఐరాస జోక్యం చేసుకోవాలి పట్టుబడుతున్న వారు తొలుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ నుంచి వెనక్కి వెళ్లాలన్న విషయాన్న పక్కనపెట్టారు అని వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు నిర్ణయంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.