న్యూజిలాండ్‌లో బతుకమ్మ ఉత్సవాలు

16-09-2019

న్యూజిలాండ్‌లో బతుకమ్మ ఉత్సవాలు

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో న్యూజిలాండ్‌లో తొమ్మిదిచోట్ల నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాల పోస్టర్‌ను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. ఏటా చేపడుతున్న విధంగానే న్యూజిలాండ్‌లో 9 రోజులపాటు బతుకమ్మ సంబురాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు అతిథులకు మొక్కల పంపిణి చేస్తామని, బతుకమ్మ పాటల పోటీల తోపాటు, బతుకమ్మ ఆడే ఆడపడుచులకు చీరలు బహూకరిస్తామని తెలంగాణ జాగృతి న్యూజిలాండ్‌ శాఖ అధ్యక్షురాలు ముద్దం ఆరుణజ్యోతిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ఆచారి, జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షుడు శ్రీకర్‌రెడ్డి, జాగృతి రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మి, మధు, న్యూజిలాండ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.