మోదీ హ్యూస్టన్‌ ర్యాలీకి ట్రంప్‌ ?

16-09-2019

మోదీ హ్యూస్టన్‌ ర్యాలీకి ట్రంప్‌ ?

అమెరికాలోని హ్యూస్టన్‌లో ఈ నెల 22న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరయ్యే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరో 60 మంది చట్టసభల సభ్యులు కూడా హాజరు కానున్నారు. వీరిలో అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు తులసీ గబ్బార్డ్‌, రాజా కృష్ణమూర్తి, ఐటీ సంస్థల దిగ్గజాలు కూడా ఉన్నారు. వీరితో పాటు మరో 50 వేల మంది ఈ కార్యక్రమాకి రానున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఆరోజు హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.