అమెరికాలో మహిళల కోసం తెలుగు సంఘం

23-07-2019

అమెరికాలో మహిళల కోసం  తెలుగు సంఘం

అమెరికాలో మహిళల కోసమే ఒక ప్రత్యేక తెలుగు సంఘం ఏర్పడింది. గతంలో వివిధ తెలుగు సంఘాల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ ప్రవాసాంధ్రురాలు ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో ఉమెన్‌ ఎంపర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ (డబ్యూఈటీఏ) పేరుతో ఈ సంఘం ఏర్పాటైంది. సెప్టెంబరు 29న సిలికాన్‌ వ్యాలీలో ఈ సంఘం ప్రారంభ సభను నిర్వహిస్తారు. ప్రముఖ తెలుగు మహిళ, పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి సుమలతకు ఈ సభలో జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తామని సంఘం వ్యవస్థాపకురాలు ఝాన్సీ రెడ్డి తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు మహిళలను ఏకతాటిపైకి తీసుకురావడం, తెలుగు భాష, సంప్రదాయం, కళలను పరిరక్షించుకోవడానికే ఈ సంఘాన్ని స్థాపించినట్లు ఝాన్సీ రెడ్డి తెలిపారు.