ఆపిల్‌ వినియోగదారులకు శుభవార్త

12-07-2019

ఆపిల్‌ వినియోగదారులకు శుభవార్త

అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్‌ కంపెనీ ఆపిల్‌ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్‌లో ఐఫోన్లపై ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ ఫోన్లతో పాటు మరికొన్ని ఫోన్లపై ధరలను తగ్గించనుంది. ఆగస్టు నెలలో ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. టాప్‌ ఎండ్‌ ఐఫోన్లు త్వరలో మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇండియాలో ఆపిల్‌ రిటైల్‌ స్టోర్లను ప్రారంభించేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. బెంగళూరులో కంపెనీ యూనిట్‌లో ఐఫోన్‌ ఎస్‌ఈ, ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ 7 స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో ఈ ఫోన్లు కూడా మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నారు.