2025 కల్లా 238 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చు

12-07-2019

2025 కల్లా 238 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చు

భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2025 కల్లా 238 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని అమెరికా-భారత్‌ వ్యూహాత్మక, భాగస్వామ్య మండలి (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) అంచనా వేసింది. ప్రస్తుతం 143 బిలియన్‌ డాలర్లుగానే ఉండగా, మరో ఆరేండ్లలో ఇది దాదాపు 100 బిలియన్‌ డాలర్ల మేర పెరుగవచ్చన్నది. ఇరు దేశాల మధ్య ఏటా వాణిజ్యం 7.5 శాతం వృద్ధి చెందితే.. తమ అంచనా సాధ్యమేనని మండలి రెండో వార్షిక నాయకత్వ సదస్సు సందర్భంగా విడుదల చేసిన నివేదికలో అభిప్రాయపడింది. గత రెండేండ్లు నమోదైన వార్షిక సగటు వృద్ధి 10-12.5 శాతం రేటు కొనసాగితే 327 బిలియన్‌ డాలర్లకు తాకుతుందని పేర్కొన్నది.