ఫోర్బ్స్‌ జాబితాలో అక్షయ్‌ కుమార్‌కు స్థానం

12-07-2019

ఫోర్బ్స్‌ జాబితాలో అక్షయ్‌ కుమార్‌కు స్థానం

ఈ ఏడాది ఫోర్బ్స్‌ ప్రకటించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత పారితోషికం తీసుకుంటున్న 100 మంది ప్రముఖుల్లో భారత్‌ నుంచి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌కు మాత్రమే చోటు లభించింది. రూ.444 కోట్ల ఆదాయంతో ఆయన ఫోర్బ్స్‌ జాబితాలో 33వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2018 జాబితాలోనూ అక్షయ్‌ కుమార్‌ 76వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2018 జాబితాలో 82వ స్థానంలో నిలిచిన నటుడు సల్మాన్‌ఖాన్‌, 2017 జాబితాలో 65వ స్థానంలో నిలిచిన నటుడు షారుఖ్‌ఖాన్‌ లకు ఈ ఏడాది చోటు లభించలేదు. అమెరికా చెందిన గాయకుడు టేలర్‌ స్విఫ్ట్‌ ఈ ఏడాది జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.