విస్తారా అంతర్జాతీయ విమాన సర్వీసులు

12-07-2019

విస్తారా అంతర్జాతీయ విమాన సర్వీసులు

టాటా గ్రూపునకు చెందిన విస్తారా ఎయిర్‌ లైన్స్‌ వచ్చే నెల నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తోంది. ఆగస్టు ఆరు, ఏడో తేదీల నుంచి ఢిల్లీ, ముంబై నుంచి బోయింగ్‌ 737-800 ఎన్‌జీ విమానాల ద్వారా సింగపూర్‌కు రోజు రెండు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపింది. కంపెనీల ప్రతినిధులు, విహార యాత్రికుల నుంచి ఈ సర్వీసులకు మంచి డిమాండ్‌ ఉంటుందని కంపెనీ భావిస్తోంది. టాటా గ్రూప్‌ సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విస్తార ఎయిర్‌లైన్స్‌ దేశంలోని 23 నగరాలకు విమాన సేవలు అందిస్తోంది.