సౌత్‌ ఏసియన్‌ సమ్మర్‌ ఫెస్ట్‌ హంగామా 13న

11-07-2019

సౌత్‌ ఏసియన్‌ సమ్మర్‌ ఫెస్ట్‌ హంగామా 13న

న్యూజెర్సిలోని సిక్స్‌ఫ్లాగ్స్‌లో మొదటిసారిగా సౌత్‌ ఏసియన్‌ సమ్మర్‌ ఫెస్ట్‌ 2019 నిర్వహిస్తున్నారు. ప్రముఖ గాయని గాయకులు ఈ సమ్మర్‌ ఫెస్ట్‌లో భాగంగా పాటలు పాడి మిమ్మల్ని మెప్పించనున్నారు. ప్రముఖ గాయని సునీత, అనిరుధ్‌ సుస్వరం, మాన్యతోపాటు హైదరాబాద్‌ కాప్రిసియో బ్యాండ్‌ ఇందులో పాల్గొంటోంది. వీరితోపాటు ప్రముఖ యాంకర్‌, సినీనటి అనసూయ భరద్వాజ్‌ కూడా వస్తున్నారు. వీరంతా చేసే హంగామా చూడాలంటే జూలై 13న మీరంతా సిక్స్‌ ఫ్లాగ్స్‌కు రావాల్సిందే. ఈ సమ్మర్‌ ఫెస్ట్‌లో భాగంగా మీరు కొనుగోలు చేసే కాంబో టిక్కెట్‌తో మీరు పార్క్‌లో సఫారీ రైడ్‌లను చేయవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలకోసం సింధూర సూరి 201 675 0136, ఉజ్వల్‌ 510 709 6147, రితు ఆనంద్‌-స్వాతి 646 907 8022లో సంప్రదించవచ్చు.