మైన్‌క్రాఫ్ట్‌తో తెలివితేటలు వృద్ధి!

11-07-2019

మైన్‌క్రాఫ్ట్‌తో తెలివితేటలు వృద్ధి!

వీడియో గేమ్‌లతో కాలం వృథా తప్ప ఏమీ ఉండదని చాలా మంది అంటూ ఉంటారు. కానీ వాటితోనూ ఉపయోగం ఉందని తాజా సర్వే పేర్కొంది. వీడియో గేమ్‌లలో మైన్‌క్రాఫ్ట్‌ ఆడితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలివితేటలు వృద్ధి చెందుతాయని క్రియేటివిటీ రిసెర్చ్‌ జర్నల్‌లో ప్రచురించారు. ముందస్తు ఆదేశాలతో కాకుండా సొంత తెలివితేటలతో వీడియో గేమ్‌లు ఆడేవారు ఇంకా చురుగ్గా ఉంటారని ఐయోవా స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డగ్లస్‌ జంటైర్‌ తెలిపారు.