యూఎస్‌ మార్కెట్‌లోకి అరబిందో ఔషధం

11-07-2019

యూఎస్‌ మార్కెట్‌లోకి అరబిందో ఔషధం

అరవిందో ఫార్మా యూఎస్‌ మార్కెట్లో సినకాల్సెట్‌ హైడ్రోక్లోరైడ్‌ అనే జనరిక్‌ ఔషధాన్ని విడుదల చేసింది. బహుళ జాతి ఔషధ కంపెనీ అయిన ఆమ్‌జెన్‌ ఇంక్‌.. విక్రయిస్తున్న సెన్‌సిపార్‌ అనే ట్యాబ్లెట్‌కు సినకాల్సెట్‌ హైడ్రోక్లోరైడ్‌ జనరిక్‌ ఔషధమని అరబిందో ఫార్మా వివరించింది. గత ఏడాది కాలంలో ఈ ఔషధం యూఎస్‌ మార్కెట్లో 1,449 మిలియన్‌ డాలర్ల విక్రయాలను నమోదు చేసినట్లు వెల్లడించింది. మూత్రపిండాల వ్యాధితో పాటు సెకండరీ హైపర్‌పారాథైరాయిడిజమ్‌ (హెచ్‌పీటీ) ఉన్న వారికి ఈ ఔషధాన్ని సిఫార్సు చేస్తారు.