APNRT President Ravi Vemuru Resign

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో వారి హయాంలో ప్రభుత్వం నియమించిన పలువురు రాజీనామా బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ అధ్యక్ష, ఎన్‌ఆర్‌టీ వ్యవహారాల సలహాదారు పదవులకు వేమూరు రవి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంకు రాజీనామా లేఖను పంపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో కృష్ణ మోహన్‌ కూడా తన పదవికీ రాజీనామా చేశారు.