డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం

16-05-2019

డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేషనల్‌ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. శత్రువుల నుంచి కంప్యూటర్‌ నెట్‌వర్క్‌కు ముప్పు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ తెలిపారు. అమెరికా కంపెనీలు విదేశీ టెలికమ్‌ సేవలు వినియోగించకుండా అడ్డుకట్ట వేసేందుకు అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన హువావే సంస్థను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైనా కోసం హువాయి గూఢచర్యం చేస్తోందనేది అమెరికా, మిత్రదేశాల ప్రధాన ఆరోపణ.