వేలంలో రూ.778 కోట్లు పలికిన పెయింటింగ్!

16-05-2019

వేలంలో రూ.778 కోట్లు పలికిన పెయింటింగ్!

ప్రముఖ ఫ్రాన్స్‌ చిత్రకారుడు మోనెట్‌ గీసిన పెయింటింగ్స్‌ కోసం న్యూయార్క్‌ నగరంలో వేలం నిర్వహించగా ఓ పెయింటింగ్‌ 110.7 మిలియన్‌ డాలర్లు (రూ.778 కోట్లు) పలికిందని నిర్వాహకులు తెలిపారు. మోనెట్‌ 1890లో వేసిన 10 పెయింటింగ్‌లను వేలంలో ప్రదర్శించామని అన్నారు. వీటిలో క్లాడ్‌ పెయింటింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. ప్రకృతి రమణీయతను కండ్లకు కట్టినట్టు తన పెయింటింగ్స్‌లో చూపడంలో మోనెట్‌ సిద్దహస్తులని వేలం నిర్వాహకులు తెలిపారు. అందుకే, ఆయన గీసిన చిత్రాలకు నేటికీ డిమాండ్‌ తగ్గడం లేదని అన్నారు.

1986లో మోనెట్‌ గీసిన పెయింటింగ్‌ వేలంలో 2.5 మిలియన్‌ డాలర్లు (రూ.17 కోట్లు) పలికింది. దీన్ని ఓ జిల్లా కలెక్టర్‌ కొనుగోలు చేశారు. 2016 నవంబర్‌లో ఓ సంస్థ నిర్వహించిన వేలంలో మోనెట్‌ పెయింట్‌కు 81.4 మిలియన్‌ డాలర్లు (రూ.572కోట్లు) వచ్చాయి. వర్షం కురుస్తున&్న సమయంలో లిల్లీ పుష్షాలు వికసిస్తున్నట్టు మోనెట్‌ గీసిన పెయింటింగ్‌కు గతేడాది మేలో ఓ సంస్థ వేలం నిర్వహించింది. ఈ పెయింటింగ్‌ 84.6 మిలియన్‌ డాలర్లకు (రూ.595 కోట్లు) అమ్ముడుపోయింది.