అమెరికాకు తిరిగి వచ్చేయండి

16-05-2019

అమెరికాకు తిరిగి వచ్చేయండి

బాగ్దాద్‌, ఎర్బిల్‌లోని రాయబార కార్యాలయాల్లోని సాధారణ సిబ్బంది వెంటనే ఖాళీ చేసి స్వదేశానికి తిరిగి రావాలని అమెరికా ఆదేశించింది. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా ఒత్తిడి పెంచిన అమెరికా గల్ఫ్‌లో సైన్యాన్ని మోహరిస్తున్నది. మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఏ క్షణం లోనైనా ఇరాన్‌ దాడి చేసే అవకాశం ఉన్నందున తమ రాయబార కార్యాలాల సిబ్బందిని ఖాళీ చేయాలని అమెరికా ఆదేశించింది. అమెరికా వ్యతిరేక మత మిలిషియా తో పాటు ఇరాక్‌లో చురుగ్గా ఉన్న ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థల నుంచి తమ పౌరులు, పశ్చిమ దేశాల కంపెనీలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇరాక్‌లోని రాయబార కార్యాలయాలను పాక్షికంగా మూసివేస్తున్నట్లు అమెరికా తెలిపింది.