అమెరికాలో డాక్టర్ రెడ్డీస్ కొత్త ఔషధం

16-05-2019

అమెరికాలో డాక్టర్ రెడ్డీస్ కొత్త ఔషధం

చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం ఉపయోగపడే డాప్టోమైసిన్‌ సూదిమందును అమెరికాలో విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. ఇది మెర్క్‌ షార్ప్‌ అండ్‌ డాహ్మే కార్ప్‌నకు చెందిన క్యూబిసిన్‌ ఔషధానికి జనరిక్‌ రూపం. మార్చి 2019 వరకూ ఏడాది కాలాన్ని పరిగణనలోనికి తీసుకుంటే.. క్యూబిసిన్‌ ఇంజక్షన్‌ అమ్మకాలు దాదాపు 640.8 మిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నాయి.