ఫేస్‌ రికగ్నిషన్‌పై అమెరికా కీలక నిర్ణయం

15-05-2019

ఫేస్‌ రికగ్నిషన్‌పై అమెరికా కీలక నిర్ణయం

ఏదైనా వీడియా క్లిప్‌ లేదా ఫొటోగ్రాఫ్‌ ను చూపితే.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విధానంలో అతని ఆనవాలును గుర్తించేదే ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌ వేర్‌. నేరాలు అరికట్టడంలో కీలకమైన ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ పై అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సిటీ ఏజెన్సీలు, పోలీసులు ఈ ఫేస్‌ సాఫ్ట్‌వేర్‌ను వాడకూడదని తీర్మానించింది. సిటీ బోర్డు సూపర్‌వైజర్ల ఓటింగ్‌ నిర్వహించింది. ఎనిమిది మంది వాడకూడదంటూ, ఒకరూ వాడాలంటూ ఓటు వేశారు.