అమెరికాతో పోరాడతామన్న చైనా

15-05-2019

అమెరికాతో పోరాడతామన్న  చైనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలను చైనా తిప్పికొట్టింది. అమెరికాలో అమీతుమీకి సిద్ధమన్న చైనా.. ఆ దేశంతో వాణిజ్య యుద్ధంలో చివరి వరకు పోరాడతామని సృష్టం చేసింది. తమతో చైనా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకపోతే ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపైనా సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్‌ షువాంగ్‌ స్పందిస్తూ సుంకాలు పెంచడం సమస్యకు పరిష్కారం కాదని మేం పదేపదే చేప్తున్నాం. చైనా వాణిజ్య యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అంతమాత్రాన మేం  ఎవరికీ భయపడం. ఎవరైనా మాతో తలపడితే చివరివరకు పోరాడుతాం. విదేశీ ఒత్తిళ్లుకు మేం తలొగ్గం. చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను రక్షించుకునే ధృడసంకల్పం, సామర్థ్యం రెండూ ఉన్నాయని అన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చైనా ప్రభుత్వ ప్రతినిధి ఇంత తీవ్రంగా వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి.