అమెరికాకు షాకిచ్చిన స్పెయిన్

15-05-2019

అమెరికాకు షాకిచ్చిన స్పెయిన్

అమెరికా అనుసరిస్తున్న విధానాలు మిత్రదేశాలకు నచ్చడం లేదు. శరణార్థులకు, ఆశ్రయం కల్పించే విషయంలో, వీసాల జారీకి సంబంధించి అమెరికా అనుసరించిన విధానాలను మిత్రదేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తాజాగా, హర్మూజ్‌ జలసంధి వద్ద ఉద్రిక్తతల విషయంలో అమెరికా నిర్ణయాలు మిత్రదేశాలకు కూడా నచ్చడం లేదు. అమెరికా మిత్ర బలగాల నుంచి తన ఫ్రిగేట్‌ను వెనక్కు పిలిపించినట్టు స్పెయిన్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని స్పెయిన్‌ రక్షణ మంత్రి మార్గెరేట్‌ రోబ్లెస్‌ ధ్రువీకరించారు. దీంతో స్పెయిన్‌కు చెందిన ఎఫ్‌-104 ఫ్రిగెట్‌, 2015 మంది నావికులు స్వదేశానికి తిరిగి వెళ్లిపోనున్నారు. వీరంతా మిషిన్‌ సర్మ్కూమ్‌ నేవిగేషన్‌ మిషన్‌లో పనిచేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని బ్రసెల్స్‌లో యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) రక్షణ మంత్రుల సమావేశంలో తీసుకొన్నారు.