జీ-20 సదస్సులో పుతిన్ తో ట్రంప్ భేటీ

15-05-2019

జీ-20 సదస్సులో పుతిన్ తో ట్రంప్ భేటీ

వచ్చే నెలలో జరుగనున్న జీ-20 సభ్యదేశాల సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. వైట్‌హౌస్‌లో హంగేరి ప్రధాని విక్టర్‌ ఓర్బాన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయుధాల నియంత్రణ, వెనిజులాలో అల్లర్లు, ఉక్రెయిన్‌ వివాదం, ఇరాన్‌ పట్ల రష్యా వైఖరి తదితర అంశాలను పుతిన్‌తో చర్చిస్తానని అన్నారు. పుతిన్‌తో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోప్‌తో రష్యా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో భేటీ అవుతారని ట్రంప్‌ చెప్పారు. వచ్చేనెలలో జపాన్‌లోని ఒసాకా నగరంలో జీ-20 దేశాల సదస్సు జరుగనుంది.