వైట్ హౌస్ లో ట్రంప్ ఇఫ్తార్ విందు

15-05-2019

వైట్ హౌస్ లో ట్రంప్ ఇఫ్తార్ విందు

ముస్లింలకు రంజాన్‌ మాసం చాలా ప్రత్యేకమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. వైట్‌హౌస్‌లో అధికారులకు, వివిధ దేశాల దౌత్యవేత్తలకు ఆయన ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్‌, శ్రీలంక, కాలిఫోర్నియా, పిట్స్‌బర్గ్‌లో జరిగిన ఉగ్రవాద దాడులపై ట్రంప్‌ విచారం వ్యక్తం చేశారు. రంజాన్‌ మాసం కుటుంబాలను, పొరుగువారిని, సమాజాన్ని మరింత చేరువ చేస్తుందని తెలిపారు. రంజాన్‌తో శాంతి, సహనంతో ఉండాలని ప్రజలు కోరుకుంటారని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని,  ప్రజలందరూ భయపడకుండా భగవంతున్ని ప్రార్థించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలో ప్రజలు కలిసికట్టుగా స్వేచ్ఛగా, భద్రతతో జీవిస్తున్నారని ట్రంప్‌ వెల్లడించారు.