షార్లెట్ లో ధర్మవరం ఎమ్మెల్యేకు సన్మానం

14-05-2019

షార్లెట్ లో ధర్మవరం ఎమ్మెల్యేకు సన్మానం

అమెరికా పర్యటనకు వచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రం షార్లెట్‌ నగరంలో ఉన్న అనంతపురంవాసులు ఘనంగా సన్మానించారు. షార్లెట్‌ అనంతపూర్‌ ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ, ఏపీ ఎన్‌ఆర్టి సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ దంపతులను ఘనంగా సత్కరించారు. తెదేపా హయాంలో గత అయిదేళ్లల్లో చేసిన కార్యక్రమాలను వివరించిన సూర్యనారాయణ, ఎన్నారై తెలుగువారు 2019 ఎన్నికల్లో తెదేపాకు మంచి తోడ్పాటును అందించారని, మాతభూమి అభివద్ధికి వారు చేస్తున్న కృషి అమోఘమైనదని అభినందించారు. అనంతపురం ఎన్నారైలు పురుషోత్తమ చౌదరి, వెంకట్‌ మాలపాటి, రవినాయుడు, కష్ణమోహన్‌, మహేష్‌ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.