భారత్ కు అమెరికా ఆఫర్

13-05-2019

భారత్ కు అమెరికా ఆఫర్

అత్యంత కీలకమైన క్షిపణి రక్షణ వ్యవస్థలు థడ్‌, పిఎసి-3 భారత్‌కు సమకూర్చేందుకు అమెరికా ముందుకు వచ్చింది. రష్యాకు చెందిన ఎస్‌-400కు ప్రత్యామ్నాయంగా వీటిని భారత్‌కి సమకూర్చేందుకు ట్రంప్‌ అధికార యంత్రాంగం కొద్ది వారాల క్రితం ప్రతిపాదించినట్లు వెల్లడైంది. క్షిపణులు అన్ని రకాల సవాళ్లను తట్టుకుని నిలిచేందుకు, అత్యంత సామర్థ్యంతో దూసుకువెళ్లేందుకు ఈ రెండు రక్షణ వ్వవస్థల అవసరం ఎంతగానో ఉంది. రష్యా నుంచి ఇటువంటి సాధనాసంపత్తిని సమకూర్చుకునేందుకు ఇండియా యత్నించింది. 2016 దేశాధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యానికి ప్రతిచర్యగా ట్రంప్‌ అధికార యంత్రాంగం రష్యాపై ఆంక్షలు విధించింది. దీని మేరకు రష్యాతో ఆయుధ సాధాన సంపత్తిని, కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే దేశాలపై కూడా అమెరికా ఆంక్షల వలయంలోకి తీసుకువస్తుంది. అయితే భారతదేశం రష్యా నుంచి ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు దిగితే ఆంక్షల విధింపు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని కొంత మేర సడలింపులు ప్రకటించింది. రష్యా నుంచి తమ క్షిపణులకు భద్రతా వ్వవస్థలను సమకూర్చుకోవాలనుకుంటున్న భారత్‌కు ఇప్పుడు అమెరికా ఆఫర్‌ను ఇచ్చినట్లు వెల్లడైంది.