క్రమశిక్షణా రాహిత్యమే జీవనశైలిలో భాగమైతే !

13-05-2019

క్రమశిక్షణా రాహిత్యమే జీవనశైలిలో భాగమైతే !

'మావాడురాత్రి  మూడుఅయితేగాని నిద్రపోడు', మా అమ్మాయితెల్లారేవరకు కంప్యూటర్లో ఏదోచేసుకుంటూ ఉంటుంది, నిద్రపోదు', 'మాచిన్నవాడు రోజూవాళ్ళ స్నేహితులతో నైట్ స్టడీస్చేస్తాడు', 'మాఅమ్మాయి ఇంతవుందో లేదో వాళ్ళ అన్నయ్యలాగ రాత్రి ఒకటి అయితే గాని నిద్రపోదు' అని కొంతమంది తల్లితండ్రులు గొప్పగానూ, పొగుడుకుంటూ చెప్పడం, మరి కొందరైతే బాధతోనూ దిగులుగాను వాపోవటం ఇంచుమించు అందరి ఇళ్లలో వినిపిస్తూ వుంటాయి. ఇంకా కొంతమంది ఇళ్లలో ఇంకా కొంచెం ముందుకు పోయి 'మాపిల్లలు సెకండ్షో తప్పితే ఇంకేమి చూడరు' అని ఒకరంటే, ఇంకొకరు 'మాపిల్లలు రాత్రి పదకొండు అయితే గాని డైనింగ్ టేబుల్దగ్గరకు రారు' అని, ఇంకొకఇంట్లో 'మేముడిన్నర్కి బయటకువెళ్లాలంటే అందరుఇంటికివచ్చిబయటపడేసరికికనీసం 11 అవుతుంది' అని గొప్పలుచెప్పుకుంటూ వుంటారు.

అసలు రాత్రిళ్ళు ఇంత లేటుగా  లేచి వుండడం అన్నది మన యువతకి ఎలా అలవాటు అయ్యింది. అసలు మన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల్లో ఇటువంటి సాంప్రదాయం ఇదివరకు నుండే ఉన్నదా అంటే ఇద మిద్దంగా లేదనే చెప్పుకోవాలి. ఆలోచిస్తే యువతలో ఈ మార్పులు గత 20 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి అనిచెప్పవచు. ఎందుకంటే నాఎరుకలో మేముగానీ మా స్నేహితులు ఎవరూ ఆవయసులోగానీ, మేము చదువుకునే రోజుల్లో గానీ ఇలా చేసిన సందర్భాలు గుర్తులేవు.

మరి అయితే అసలు ఎంతసేపు నిద్రపోవాలి ? అసలు నిద్రకి క్రమశిక్షణ అవసరమా? క్రమశిక్షణే అవసరమైతే, అసలు ఎవరు నిర్దేశించారు? అసలు నిద్ర రాత్రేఎందుకు పోవాలి ? అని నేటియువత అడిగేరోజులివి.

ఈప్రశ్నల్లోకి వెళ్లేముందు వీరు కాలాతీతంగా ఎందుకు నిద్రపోతారో విశ్లేషిద్దాం. పిల్లలు వృత్తిరిత్యాలేదా ఉద్యోగరిత్యా కాలాతీతంగా నిద్రపోవటంలోమనం చేయగలిగేది ఏమిలేదు. ఇవికాకఎక్కువ శాతం పిల్లలువాళ్ళ విద్యాభ్యాసంలో బాల్యం నుండి ఇంటర్మీడియట్  చదివేవారకు బయట ప్రపంచం తెలియకుండా పెరిగివుంటారు. దీనికి కారణం మన విద్యావ్యవస్థలో S.S.C ఇంటర్మీడియట్పరీక్షలు జీవితంలోనేపెద్దపరీక్షలుగా పరిగణిస్తున్నాము. ఇలా పరిగణించటానికిగల కారణాలు-పిల్లల సామర్ధ్యాన్ని గుర్తించకుండా ఐఐటి, మెడిసిన్ లలోచేర్పించాలని తల్లితండ్రుల  ఆకాంక్ష మరియు ఇరుగు పొరుగు పిల్లలతో పోలిక, బంధు మిత్రుల పిల్లలతో పోలిక అవుతున్నాయి. ఇంటర్మీడియట్  అయ్యేవరకు విపరీతమైన ఒత్తిడికి గురువవుతారు. ఒకసారి ఇంటర్మీడియట్అయిన తరువాత ఏదయినా డిగ్రీ కోర్స్లోచేరగానే వాళ్లకి పూర్తిగా స్వేచ్ఛ వచ్చి పంజరంలో నుంచి బయటపడ్డపక్షిలాగా స్వేచ్ఛ అనుభవిస్తారు. 

కొంతమంది పిల్లలు స్వాభావికంగా పెద్దవాల్లమయ్యాము అనుకొంటారు. ఇక్కడ వారికి దొరికే స్నేహితులు, వాళ్లతో పిల్లలకు ఉన్న స్నేహం, కాలేజీల్లో వారి జీవనవిధానం వారి  జీవనానికిపునాది అవుతుంది. చిన్నపట్నుంచి తల్లితండ్రుల ఆకాంక్షలకు ఒత్తిడికి గురై ఉండడం వలన వాళ్లు తల్లితండ్రులకు దూరంగా ఉండాలని, తలితండ్రులను తప్పించుకుని తిరుగుతూ వుండాలనుకొంటారు. ఇలా తలితండ్రులకు పిల్లలకు ఒక దూరం ఏర్పడుతుంది.  అప్పటినుండి వీలైనంత వరకు ఏకాంతంగా గానీ వారి స్నేహితులతో గాని ఎక్కువ సమయం గడపాలని చూస్తూవుంటారు. ఇవికాక ఎక్కువ శాతంలో, తలితండ్రులు నిద్రించే సమయంలో వారిని పట్టించుకోరు కాబట్టి ఆసమయం అనువైనది గాభావిస్తారు. పిల్లలను పట్టించుకోకుండా వదిలేస్తే వారి ఈప్రవర్తన ఉద్యోగాల్లో చేరేదాకా లేకపెళ్లి అయ్యేదాకా ఇలానే కొనసాగుతుంది.

మనిషి నిద్రాసమయం సృష్టిమొత్తంలో రాత్రి పూటగ ప్రకృతి నిర్ణయించింది. మనిషి మనుగడ మొదలై సాంకేతిక విజ్ఞానం, విద్యుత్తూ సగటుమనిషి జీవనాన్ని శాసించక ముందే, ప్రకృతి నిర్దేశించిందే మన నిద్రాసమయం. మన పూర్వీకులు, మనకంటే కొన్నితరాల ముందువారు మనకు  విద్యుత్తూ వాడుకలోకి రాకముందే ఈ నిద్రసమయాన్ని సూర్యాస్తమయం సూర్యోదయం మధ్యకాలంగా నిర్దేశించారు. ఆ సమయంలో దేవతలు సృష్టిని ఆహ్లదకరమైన వాతావరణంతో నిద్రకు అనుకూలంగా ఉంచుతారని మనవారు నమ్ముతారు.

అసలునిద్ర ఎందుకుపోవాలి అంటే మనిషి మనుగడకి ప్రాధమిక అవసరాల్లో నిద్ర అతి ముఖ్యమైంది. ఒకమనిషి ఒకరాత్రి నిద్రలేకుండా వున్నాడనుకొందాం. మరుసటి రోజు అతని సామర్ధ్యం మొదటి రోజంత ఉండదు. చాలా చికాకుగా విచిత్రంగా ప్రవర్తిస్తూంటాడు. లెక్కచేయకుండా అలాగే కొనసాగించి రెండోరోజూ కూడా నిద్రపోకపోతే మూడవ రోజు మనిషి మాట్లాడుతూ లేక ఏఅవస్థలో ఉంటేఆ అవస్థలోనే నిద్రలోకి జారుకుంటాడు. దీనిని బట్టి తెలిసేదేంటంటే క్రమం తప్పకుండా మనిషి నిద్రపోవాలి.

ఇక పోతే రోజుకు ఎన్నిగంటలు నిద్రపోవాలి అన్నదానిపై ఇదమిద్దంగా నిర్దుష్టంగా ఏకాభిప్రాయం లేదు. సామాన్యంగా 6 నుంచి 8 గంటలు కనీసం నిద్రపోవాలి అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

అసలు రాత్రిపూట నిద్రపోకుండా వీరు చేస్తున్నపనులు ఏమిటి ? ప్రస్తుతం కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల సౌలభ్యం గ్రామాల వరకు వ్యాప్తి చెందడం వీటి బహుళ సేవలు చవకగా దొరకడంతో వీటి వినియోగంచాలా సులభతరంఅయింది. ప్రతి ఒక్కరి చేతిలో కనీసం రెండు ఫోన్లుఉండడం పరిపాటి అయిపొయింది.

పిల్లలుగానీ, వారి తోబుట్టువులుగానీ, స్నేహితులుగానీ ప్రపంచంలోఏమూల వున్నా ఇంటర్నెట్లో కనెక్టయిపోయి చాటింగ్ చేసుకోవడం, వెబ్ గేమ్స్ఆడడం, సినిమాలు, అనేకరకాలైన షోస్, ప్రోగ్రాములు చూడటం సాధారణంగా చేస్తూవుంటారు. ఈసమయంలో వేర్వేరు దేశాలు, వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు ప్రాంతాలవారితో అనుసంధానం కావడం కోసం పిల్లలు రాత్రులు జాగరంచేసి పగటిపూట నిద్రపోతు వుంటారు. ఇది వినడానికి, చెప్పుకోవడానికి, బంధాలు బాంధవ్యాలు పెంచుకోవటానికి బాగానే వుంటాయి. దీనివలన స్నేహితులతోను,  కావలసినవారితోనూ అనుబంధాలు పెరగటంమాట అటువుంచితే, దీనివలన పిల్లలకు కీడుజరిగేదే ఎక్కువగా ఉంటుంది.

ఈసమయం కానిసమయంలో లేచివుండడం, అలాగే సమయంకాని సమయంలో నిద్రపోవడం ఇంటికి, వంటికి మంచిదికాదు. దీనివలన బహు మానసిక, శారీరక సమస్యలు తలెత్తే అవకాశాలుచాలా ఎక్కువగా వున్నాయి. ఇలా రాత్రిపూటలేచి వుండడం వలన వీరిఆహార అలవాట్లుకూడా బిన్నంగా తయారవుతాయి. ఇలారాత్రులు లేచివుండడంవలన డిప్రెషన్ (depression), మనోవ్యాకులత, ఆత్మనూన్యతా భావం, నలుగురి ముందుకి రాలేక పోవడం, వారికే అంతా తెలుసుననే భావన,తలనొప్పి (మైగ్రేన్), కంటి సమస్యలు, తలతిరగడం, మానసిక ఆందోళన, తెలియని భయం, ఇన్సోమ్నియా (insomania), ఇత్యాది మానసిక రుగ్మతలు రావడాన్నిఆస్కారముంటే, శారీరకంగా అధిక బరువు (ఒబేసిటీ), బిపి, డయాబెటిస్, జీర్ణసమస్యలు, ఇత్యాది రుగ్మతలు రావడానికి ఆస్కారముంది. 

ఈ సమస్యల వలన కొంతమంది జీవితం అస్తవ్యస్తం చేసుకొంటున్నారు, కొంతమంది మానసిక వైదుల పర్యవేక్షణలో వున్నారు.  మరి ఇన్ని సమస్యలు వస్తున్నా పిల్లలు ఎందుకు దీనివైపు మొగ్గు చూపుతున్నారు? దీనికి ముఖ్య కారణాలుగా చెప్పుకోవాలంటే తోటివారి ప్రేరేపణ, ఊహాప్రపంచంలో జీవించే అవకాశం, తలితండ్రులను మభ్యపెట్టామనే భ్రమలో ఉండడం, ఇత్యాదివి. ఇవి ఇలావుంటే  కొంతమంది పిల్లలు వారు అభ్యసించిన  సాంకేతికాదిరంగాల్లో, విద్యా ఉద్యోగరంగాల్లో మార్పులు, చేర్పులు, కూర్పులు, ఉద్యోగ అవకాశాలు, ఏదో తెలియని విషయాలు నేర్చుకోవాలనే తాపత్రయం, ఇత్యాదివి తెలుసుకోవటానికి ఆసమయంలో తోటివారితో ముచ్చటించటానికి వినియోగిస్తూ వుంటారు.

మరిఇన్ని సమస్యలువున్నా ఈసమస్యని పరిష్కరించుకోవడంలేదా తగ్గించుకోవడంచేయలేమా ? ఖచ్చితంగా చేయవచ్చనే చెప్పవచ్చు. ఈ సమస్యకి ప్రధానంగా తల్లితండ్రులు, పిల్లలు ఉమ్మడిగా ఇలా చేస్తే సులభంగా పరిష్కరించుకోవచ్చు. తలితండ్రులు పిల్లలకు స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు చేయగలగాలి. వారిని విద్యా సంబంధిత విషయాల్లో తమ  ఆశయాలమేరకు రావాలని ఒత్తిడి తేకూడదు. వారిని ఏపరిస్థితుల్లోను శాసించకూడదు. వారి ఇష్టాయిష్టాలు, అభిరుచులు తెలుసుకోవాలి.

పిల్లలు తలితండ్రులను చూస్తే స్నేహతులని చూసినట్లుగా భావించివారితో తమ దినచర్యల్లో జరిగే సంఘటనలు, వారి స్నేహితుల ముచ్చట్లు, వారి కాలేజీ విశేషాలు చర్చించుకోగలగాలి. నిరుద్యోగయువతను 24 గంటలు ఉద్యోగ సంబంధిత విషయాలు గానీ, వారిని ప్రత్యక్షంగాగానీ పరోక్షంగాగానీ అపేక్షించకూడదు. వారు ఉద్యోగ విషయంలో చాలా క్షోభ అనుభవిస్తూనే వుంటారు. పిల్లలను వారి స్నేహితుల ఎదుట కించపరుస్తూ మాట్లాడ కూడదు. మనం కించపరుస్తూ మాట్లాడితే వారి స్నేహితులు గూడా అలుసుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు.  పిల్లలు చేస్తున్న పనులను చూసీచూడనట్లుగా పర్యవేక్షించాలి, కానీ ఆవిషయం పిల్లలకు తెలియకూడదు. వారు గోప్యంగా ఏదయినా పనులు చేస్తున్నా, ఏదయినా హద్దులు అతిక్రమిస్తున్నట్లుగా పసిగడితే నివారణచర్యలుచే పట్టాలి.  పిల్లలు చేస్తున్న పనులను నిర్మొహమాటంగా వద్దనిచెప్పగూడదు, సున్నితంగావారు తెలుసుకొనేవిధంగా వివరించి చెప్పాలి. 

పిల్లలకు సంబందించిన విషయాలువారితో చర్చించి వారి అభిప్రాయాల క్కూడావిలువ నివ్వాలి. ఒకవేళవారి అభిప్రాయంతో ఏకీభవించక పోతే ఎందుకు ఏకీభవించట్లేదో మనం వారికి  అర్ధమయేలా వివరించి చెప్పాలి. పిల్లలు మనలాగా ఉండాలనుకోవడం పొరపాటు. వారి వ్యక్తిత్వంవారికి ఉంటుంది. దానిని మనం గౌరవించాలి. వారి అలవాట్లను, ప్రవర్తనను మనం విమర్శించకూడదు. ఆవయసులో మనంగూడా ఎలావున్నామో మన తలితండ్రులను ఎంత  ఇబ్బందిపెట్టామో గుర్తుకు తెచ్చుకోవాలి. పిల్లలకు వ్యాపకాలు పెంచాలి. తలితండ్రలతో పాటు ఉదయంపూట యోగా, వాకింగ్ చేసే అలవాట్లు అలవర్చాలి. వారికీ ఏదయినా సమస్యవస్తే మనతో చర్చించగలిగే అనుకూలవాతావరణం, ధైర్యం, నమ్మకం కలిగేలా చూడాలి. సమస్యకు పరిష్కారం ఎక్కడో దొరకదు. సమస్య ఉన్నచోటే దొరుకుతుంది. మనమేదైనా పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలి కానీ వేరెక్కడోకాదు. సమస్యా పరిష్కారానికి సమిష్టిగా పాటుపడాలి. సంకల్పంబలమైంది అయితే కొండలు కూడా కదల్చవచ్చు అన్న నానుడిముందు ఇదిఎంత.

Syam Sunder Vasili

Cell: 91 9849033460

Spiritual Foundation, Inc

7062 South Beringer Drive

Cordova, Tennessee 38018