టాకో ఉగాది పురస్కారాలు

13-05-2019

టాకో  ఉగాది పురస్కారాలు

సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం ఆధ్వర్యంలో కొలంబస్, ఒహాయోలో తెలుగు వారంతా మే 11, శనివారం నాడు డబ్లిన్ జెరోం హైస్కూల్లో అత్యంత కోలాహలంగా వికారి నామ  ఉగాది వేడుకలు జరుపుకున్నారు. కథానాయకుడు సునీల్  ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై తన ప్రదర్శనతో వేడుకలను విశేషంగా రక్తి కట్టించారు. టాకో అధ్యక్షులు ఫణి భూషణ్ పొట్లూరి దీప ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించగా, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొలంబస్ లోని తెలుగు వారంతా ప్రత్యేక కార్యక్రమాలతో వేడుకలకు వన్నె తెచ్చారు. పంచాంగ శ్రవణం తో ప్రారంభమై రామాంజనేయ యుద్ధం, శ్రీ కృష్ణ లీలలు, సౌందర్య హిట్స్ వంటి పౌరాణిక, జానపద, చారిత్రాత్మక మరియు సామాజిక కార్యక్రమాలతో ఆద్యతం వేడుకలు అట్టహాసంగా సాగాయి. గాయనీ గాయకులు సుమంగళి,  సందీప్ తమ గాన మాధుర్యంతో ఆద్యంతం శ్రోతలను రజింపచేశారు.

ఉగాది పురస్కారాలలో భాగంగా అక్షరమాల విజేతలకు మరియు తెలుగు టీచర్లకు బహుమతి ప్రధానం జరిగింది. కొలంబస్ లోని తెలుగు విద్యార్థులలోని ప్రతిభకు గుర్తింపుగా పలువురు విద్యార్థినీ విద్యార్థులకు విద్యార్థి రత్న పురస్కారాలు అంద చేసారు. 1500 మందికి పైగా తెలుగు ప్రజలు హాజరైన ఈ కార్యక్రమంలో షడ్రుచుల విందు భోజనం ఆహూతులకు వడ్డించారు. ఈ ఉగాది వేడుకలకు ముఖ్య అతిధులకు, అద్భుతంగా జరగడానికి తోడ్పాటునడిచిన వాలంటీర్లందరికీ టాకో అధ్యక్షులు ఫణి భూషణ్ పొట్లూరి, జగన్నాథ్‌ చలసాని, శ్రీనివాస్‌ పరుచూరి, స్వామి కావలి, హర్ష కామినేని, హరిక కొమ్మూరి, సుధీర్‌ కనగాల, వీణ కామిసెట్టి సరితా నందిమల్ల, శ్వేత, రచన బుక్క, సిద్థార్థ రేవూరు ప్రదీప్‌ కుమార్‌, సంధ్య కనక, విజయ్‌ కాకర్ల వేణు అబ్బూరి, శ్యామ్‌ గద్దె రాజ్‌ వంటిపల్లి, ప్రతాప్‌ కంతేటి, శివ చావా, ప్రదీప్‌ గుటక, శ్రీ వర్షిణి ముదులూరు, సుభాషిణి సదనాల,శ్రీలత రేవూరు కోటేశ్వర బోదిపూడి, ప్రసాద్‌ కండ్రు, రమేష్‌ కొల్లి, శ్రీకాంత్‌ మునగాల  కృతఙ్ఞతలు తెలుపుతూ వేడుకలు ముగించారు.

Click here for Event Gallery