న్యూజెర్సిలో తానా మహాసభల ప్రచారం

11-05-2019

న్యూజెర్సిలో తానా మహాసభల ప్రచారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వాషింగ్టన్‌ డీసీలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్న తానా 22వ మహాసభలను పురస్కరించుకుని వివిధ నగరాల్లో ఫండ్‌రైజింగ్‌ కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. ఇందులో భాగంగా న్యూజెర్సి, అస్టిన్‌, హ్యూస్టన్‌, డాలస్‌, డిట్రాయిట్‌, కొలంబియా నగరాల్లో ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.

న్యూజెర్సిలో జరిగిన ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్‌ వేమన పాల్గొని ప్రసంగించారు. వాషింగ్టన్‌ డీసీలో నిర్వహిస్తున్న మహాసభల ఏర్పాట్లు, నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలను అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవినేని లక్ష్మీ, దాము గెదెల, వినోద్‌ కుమార్‌ రాచకుంట, సుధీర్‌, కమల్‌ గోగినేని, సుబ్రహ్మణ్యం, చంద్ర, ఎన్‌ఆర్‌సి నాయుడు, రాజా కసుకుర్తి, రవి పొట్లూరి, వంశీ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తానా కాన్ఫరెన్స్‌ ఫండ్‌రైజింగ్‌ చైర్‌ రవి మందలపు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click here for Photogallery