జపాన్ దేశ చరిత్రలో ఇదే తొలిసారి

24-04-2019

జపాన్ దేశ చరిత్రలో ఇదే తొలిసారి

జపాన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారిగా ఓ భారత సంతతి వ్యక్తి ఘన విజయం సాధించారు. ఈ నెల 21న జరిగిన ఈ ఎన్నికల్లో టోక్యోలోని ఎడొగావా నుంచి పురానిక్‌ యోగేంద్ర గెలుపొందారు. భారతీయులు, జపనీయులు, కొరియన్లు ఎక్కువడా ఉండే ఎడొగావా వార్డులో ఆయనకు 6,477 ఓట్లు వచ్చాయి. డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ జపాన్‌ మద్దతులో ఆయన గెలుపొందారు. అన్ని వర్గాల ప్రజలకు సేవలందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. 1997 లో విద్యార్థిగా ఉన్నప్పుడు యోగేంద్ర జపాన్‌కు వచ్చారు. రెండేండ్ల తర్వాత తిరిగి భారత్‌కు చేరుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత ఇంజినీర్‌గా పనిచేయడానికి తిరిగి జపాన్‌కు వెళ్లారు. 2005 నుంచి ఎడొగావా వార్డులో నివాసం ఉంటున్నారు. 2011లో జపాన్‌లో సునామీ వచ్చినప్పుడు బాధితులకు సహాయ సహకారాలు అందించారు. ఆయన సేవలను గుర్తించిన జపాన్‌ ప్రభుత్వం యోగేంద్రకు 2012లో ఆ దేశ పౌరసత్వం ఇచ్చింది.