అమెరికా ఆంక్షలను భారత్, చైనాలు వ్యతిరేకిస్తాయా?

24-04-2019

అమెరికా ఆంక్షలను భారత్, చైనాలు వ్యతిరేకిస్తాయా?

అమెరికా ఆంక్షల నేపథ్యంలోనూ ఇరాన్‌ నుంచి ముడి చమురు దిగుమతులను చైనా, భారత్‌ వంటి దేశాలు పూర్తిగా తగ్గించుకోకపోవచ్చని ఇంధన విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మే 2 తర్వాత ఇరాన్‌ నుంచి చమురును కొనుగోలును దేశాలు పూర్తిగా ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికార యంత్రాంగం సృష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఆరు నెలల మినహాయింపు పొందిన దేశాలు షాక్‌కు గురయ్యాయి. భారత్‌, చైనాతో పాటు ఎనిమిది దేశాలకు అమెరికా మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.