TANTEX 141th Nela Nela Telugu Vennela Sahiti Sadassu

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదికసమర్పించు "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం, ఏప్రిల్ 21 న సాహిత్య వేదిక సభ్యులు  శ్రీమతి అట్లూరి స్వర్ణ ఆధ్వర్యంలో జరిగినది. ప్రవాసంలోనిరాటంకంగా 141 నెలలుపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ యొక్క విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసిజయప్రదం చేసారు.

కార్యక్రమంలో ముందుగా చిన్నారి మాడ సమన్విత మృదుమధురంగా ప్రార్థనా గీతాన్ని ఆలపించిప్రారంభించింది.  శ్రీమతి తెలిదేవర మంజు గారి శిష్యులు శ్రీమతి వెంపటి సీత, శ్రీమతి శ్రీలత మల్లాడి, చిరంజీవి గెడ్డశ్రీయ హృద్యంగా వీణా వాద్యంతో ముందుకు సాగిన ఉగాదికవి సమ్మేళనం లో డా. ఊరిమిండి నరసింహారెడ్డిరవీంద్రుని గీతాంజలి, శ్రీ మాడ మాడ్దయాకర్ కవితా గానం, శ్రీ మద్దుకూరి చంద్రహాస్ సోషల్ మీడియా పోస్ట్ లపై రాసినస్వీయ కవిత, శ్రీ మల్లవరపు అనంత్ స్వీయ రచన "కొంటెతామర", శ్రీ కన్నెగంటి చంద్ర స్వీయ కవిత "మళ్ళీ ఇంకోవసంతం", శ్రీ పుదూర్ జగదీశ్వరన్ స్వీయ రచన తో సాగి శ్రీవేముల లెనిన్ జాషువా లఘు ఖండిక "గిజిగాడు" సమీక్షతో ముగిసింది. చిన్నారులు వేముల సాహితీప్రియ, వేములసింధూర, మాడ సమన్విత తడుముకోకుండా, చూడకుండాకందుకూరి రచన "ఎంత చక్కనిదోయి ఈ తెలుగు" అంటూచక్కగా పాడి ప్రశంసలు అందుకున్నారు.  

ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి డా. రాజ్యశ్రీకేతవరపు రచించిన వంద ప్రశ్నలు – వేలభావాలుపుస్తకావిష్కరణ జరిగింది.  ఫ్రముఖ విశ్లేషకులు నియోగిరచయిత్రి కవిత్వం పై వ్రాసిన  సాహిత్య విశ్లేషణ, తనకుసంధించిన 100 ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలుపొందుపరిచి ఈ పుష్తకం ప్రచురించినట్లు తెలియచేసారు.  పుస్తకం పై శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, అధ్యక్షులు వీర్నపుచినసత్యం స్పందించారు.  ముఖ్య అతిథిగా విచ్చేసినప్రముఖ రచయిత్రి డా. రాజ్యశ్రీ కేతవరపు "షడ్రుచుల సమ్మేళనం - కవిత్వం" అనే అంశంపై ప్రసంగించారు.  ప్రతిరుచికి చక్కని ఉదాహరణలతో అనర్ఘళంగా సాగినప్రసంగంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. గీతామృతం లో భగవద్గీత లో శ్లోకాలను సామాన్యమనవుడికి అర్థమయ్యేరీతిలో వ్రాయడం లో తనఅనుభవాలు పాఠకుల స్పందన, ఏ ఎన్ ఆర్ తో తనఅనుబంధం మొదలైన విషయాలను స్పృశిస్తూషడ్రుచులనూ ఉదహరిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగాప్రసంగించారు. 

ముఖ్య అతిథిని శ్రీమతి భట్రాజు రాణిపుష్పగుచ్ఛముతో సత్కరించగా సమన్వయకర్త గావ్యవహరించి అట్లూరి స్వర్ణ సభకు పరిచయం చేసారు. ప్రసంగానంతరం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘంఅధ్యక్షులు  వీర్నపు చినసత్యం, పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డసుబ్రహ్మణ్యం మరియు పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండినరసింహారెడ్డి  దుశ్శలువా, మరియు సాహిత్యవేదిక బృందసభ్యులు జ్ఞాపికతో సత్కరించారు.  ఉపాధ్యక్షులు పాలేటిలక్ష్మి, పాలకమండలి సభ్యులు కన్నెగంటి చంద్ర, కార్యవర్గసభ్యులు మండిగ శ్రీలక్ష్మి మరియు సాహిత్య వేదిక బృందం ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు వీర్నపు చినసత్యం ముఖ్య అతిథి ప్రసంగంపై స్పందిస్తూగత ఐదు సంవత్సారాలుగా పలుమార్లు తెలుగు వెలుగు పత్రికకు కథలు కవితలు అందిస్తున్న రచయిత్రిని ఈవిధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.  సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకుకృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీప్లాజా ,టీవీ9, టీవీ  5, మన టీవీ,  లకు  కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.   

Click here for Event Gallery