ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం

23-04-2019

ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం

భారతదేశానికి ఇబ్బంది కలిగించేలా ఇరాన్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్‌ సహా ఏ దేశానికి మినహాయింపు ఇవ్వబోమని ప్రకటించారు. ఇంతవరకు కొన్ని దేశాలకు విశేష తగ్గుదల మినహాయింపు (సిగ్నిఫికెంట్‌ రిడక్షన్‌ ఎక్సెప్షన్‌-ఎస్‌ఆర్‌ఈ) విధానం కింద అక్కడ నుంచి చమురును కొనుగోలు చేసే అవకాశం ఇచ్చారు. ఇకపై ఆ విధానం ఉండబోదని అధ్యక్ష కార్యాలయమైన శ్వేత సౌధం ప్రకటించింది. ఎస్‌ఆర్‌ఈల కాలపరిమితి మే రెండో తేదీన ముగిసినప్పుడు దాన్ని మళ్లీ పొడిగించకూడదని అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయించారు. ఇరాన్‌ చమురు ఎగుమతులు (మే నాలుగో తేదీ నాటికి) సున్నా స్థాయికి తీసుకొని రావడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు లేకుండా చేయడమే ఉద్దేశం అని పేర్కొంది.