యూఎస్ నిర్ణయంపై ఫిక్కీ అభినందనలు

23-04-2019

యూఎస్ నిర్ణయంపై ఫిక్కీ అభినందనలు

ముఖ్యంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారంలో ట్రాఫికింగ్‌తో పాటు నకిలీ వస్తువుల నియంత్రణకు ఉద్దేశించిన మెమొరాండంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. దీనిపై యూఎస్‌ ప్రభుత్వ నిర్ణయానికి ఫిక్కీ అభినందనలు తెలిపింది. ఫిక్కీ  కొన్నేళ్లుగా నకిలీ ఉత్పత్తులు, స్మగ్లింగ్‌పై పోరాడుతూ వస్తోంది. ఈ సందర్భంగా ఫిక్కీ ప్రతినిధి అనిల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ నకిలీ వస్తువుల నియంత్రణ కోసం అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి ముప్పు వాటిల్లకుండా ఉండకపోవడంతో పాటు, ప్రజారోగ్యానికి హాని వాటిల్లకుండా ఉంటుందన్నారు. కాగా ఫిక్కీ ప్రభుత్వానికి అనుసంధానమై పనిచేస్తూ, అధికారులు, మీడియా, న్యాయ నిపుణుల సలహాలు స్వీకరిస్తూ నకిలీలు, స్మగ్లింగ్‌లను నియంత్రిస్తుంటుంది.