అమెరికా నిబంధనలను ఉల్లంఘించలేదు

22-04-2019

అమెరికా నిబంధనలను ఉల్లంఘించలేదు

వెనిజులా ప్రభుత్వానికి చెందిన పీడీవీఎస్‌ఏకు నగదు చెల్లింపుల కోసం మరే సంస్థను ఆశ్రయించలేదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. ఈ విషయాన్ని రిలయన్స్‌ ప్రకటించింది. ఇప్పటికే అమెరికా ఆంక్షలను తప్పించుకొని చమురు విక్రయించి వెనిజులాకు నగదు అందేలా చూసేందుకు అధ్యక్షుడు నికోలస్‌ మదురో రష్యాకు చెందిన రోస్‌వెస్ట్‌ను ఆశ్రయించినట్లు రాయిటర్స్‌ వార్త సంస్థ తెలియజేసింది. ఏప్రిల్‌లో వెనిజులాకు చమురు రవాణాకు సంబంధించి రిలయన్స్‌ రూసోనెఫ్ట్‌ ద్వారా పరిష్కరించుకొన్నట్లు తెలిపారు. దీనికి ప్రతిగా రిలయన్స్‌ అమ్మకం ధరలో 3 శాతం వరకు ఫీజు రూపంలో చెల్లించేందుకు సిద్ధమైందని ఆ కథనంలో పేర్కొన్నారు. దీనిపై రిలయన్స్‌ స్పందించింది. అవి నిర్లక్ష్యంతో కూడిన తప్పుడు వార్తలు అని సంస్థ పేర్కొన్నది. తాము అటువంటి కొనుగోళ్లు చేయలేదని సంస్థ సృష్టం చేసింది. తమ కొనుగోళ్ల విషయాలపై అమెరికాకు పూర్తి సమాచారం ఉందని సంస్థ తెలియజేసింది.