శ్రీలంకకు అండగా ఉంటాం : ట్రంప్

22-04-2019

శ్రీలంకకు అండగా ఉంటాం : ట్రంప్

శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 215 మందికి పైగా చనిపోవడం పట్ల అమెరికా ప్రజల తరపున సంతాపం తెలియజేస్తున్నాను. ఎలాంటి సాయం కావాలన్నా మేము అండగా ఉంటాం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అయితే సంతాప సందేశం పోస్ట్‌ చేసే క్రమంలో ట్రంప్‌ చేసిన పొరపాటు నెట్‌లో బాగాట్రోలైంది. మొదట చేసిన కామెంట్‌లో బాంబు పేలుళ్లలో 138 మిలియన్ల (13.8 కోట్ల మంది) జనం చనిపోయినట్టుగా పేర్కొన్నారు. ఆలస్యంగా ఈ అంశాన్ని గుర్తించిన ఆయన ఆ పోస్ట్‌ను ట్విటర్‌ నుంచి డిలీట్‌ చేసి మరో కామెంట్‌ పోస్ట్‌ చేశారు.