డిట్రాయిట్ లో తానా-డిటిఎ చిత్రలేఖనం పోటీలు

22-04-2019

డిట్రాయిట్ లో తానా-డిటిఎ చిత్రలేఖనం పోటీలు

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) వాషింగ్టన్‌ డీసిలో త్వరలో నిర్వహించనున్న 22వ మహాసభలను పురస్కరించుకు అమెరికాలోని వివిధ నగరాల్లో వివిధ పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డిట్రాయిట్‌లోని శ్రీ వేంకటేశ్వర హిందూ దేవాలయంలో ఎన్నారై చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. 4-6, 7-10, 11-14ఏళ్ల వయస్సు వారికి వివిధ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలను కూడా ఎంపిక చేసి ప్రకటించారు. డిట్రాయిట్‌ తెలుగు సంఘం ఈ పోటీలకు సహకారాన్ని అందించింది.

4-6 విభాగం: ప్రథమ బహుమతి సంగపల్లి ఆగ్రతకు ద్వితీయ బహుమతి వైష్ణవి, తతీయకు బహుమతి దుగ్గిరాల పూర్వీకి లభించింది.

7-10 విభాగం: ప్రథమ బహుమతి బచ్చు సుభాష్‌, ద్వితీయ బహుమతి కర్రల విరూజ్ఞ, త తీయ బహుమతి ఈషా హరీష్‌కు వచ్చింది.

11-14 విభాగం: ప్రథమ బహుమతి జింగిలిపాలెం శాన్వి, ద్వితీయ బహుమతి నల్లారి అనీష్‌, తతీయ బహుమతి సూర్యదేవర శ్రద్ధకు లభించింది.

చిన్నారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, 23మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తానా మిచిగన్‌ ప్రాంతీయ ప్రతినిధి సునీల్‌ పంత్ర అన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను తానా ప్రతినిధులు దుగ్గిరాల కిరణ, వెలగా శుభాకర్‌, కారుమంచి వంశీ, పెద్దిబోయిన జోగేశ్వరరావు, డిట్రాయిట్‌ తెలుగు సంఘం ప్రతినిధులు బచ్చు సుధీర్‌, గడ్డం శుభ్రత, మారుపూడి జ్యోతి, బొప్పన ద్వారకాప్రసాద్‌, ఉప్పలపాటి నరసింహారావు, శివ, ఆత్మకూరి సంతోష్‌, శిరీష ప్రతాప తదితరులు పర్యవేక్షించారు.