అమెరికాలో భారతీయుడికి జైలు శిక్ష

20-04-2019

అమెరికాలో భారతీయుడికి జైలు శిక్ష

ప్రపంచస్థాయి కాల్‌సెంటర్‌ కుంభకోణంలో హేమల్‌కుమార్‌ షా (27) అనే ఓ భారతీయుడికి అమెరికా కోర్టులో 8 ఏళ్ల ఆరు నెలల జైలుశిక్ష, 80 వేల డాలర్ల జరిమానా పడింది. కాల్‌సెంటర్‌ కుంభకోణంలో శిక్షపడిన భారతీయుల్లో హేమల్‌కుమార్‌ రెండో వ్యక్తి. 2014 నుంచి 2016 మధ్య హేమల్‌ అమెరికాకు చెందిన కొంతమంది సహకుట్రదారులతోపాటు భారత్‌లో పనిచేసే కాల్‌ సెంటర్లతో కలిసి అమెరికావాసుల నుంచి డబ్బులు దోచుకునేందుకు కుట్రపన్నారు. ఐఆర్‌ఎస్‌ అధికారుల మాదిరిగా వ్యవహరిస్తూ, పాత పన్నులను వెంటనే చెల్లించకపోతే జరిమానా విధిస్తామంటూ బాధితులను బెదిరించి డబ్బులు దండుకున్నారు.