భారతీయ అమెరికన్ కు అరుదైన గౌరవం

20-04-2019

భారతీయ అమెరికన్ కు అరుదైన గౌరవం

భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త, సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ శ్రీశ్రీనాథ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత క్లీవ్‌లాండ్‌ ఇంటర్నేషనల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌గా ఎంపికయ్యారు. జీవశాస్త్రం, సుస్థిర అభివృద్ధి రంగాల్లో ఆయన చేసిన సేవలకుగానూ ఈ గౌరవం దక్కింది. కేస్‌ వెస్టర్స్‌ రిజర్వ్‌ యూనివర్సిటీలో సుదీర్ఘకాలంగా ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. సేవా ఇంటర్నేషనల్‌ సంస్థకు అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. ప్రొ.శ్రీనాథ్‌ బెంగళూరు విశ్వవిద్యాలయంలో బీఈ, ఐఐఎస్‌సీ నుంచి ఎంఈ పూర్తి చేశారు. మేరీలాండ్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పొందారు.