సింగపూర్ నుంచి అమెరికాకు భారతీయుడి అప్పగింత

20-04-2019

సింగపూర్ నుంచి అమెరికాకు భారతీయుడి అప్పగింత

కాల్‌సెంటర్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ భారతీయుడిని సింగపూర్‌ నుంచి అమెరికాకు అప్పగించారు. అహ్మదాబాద్‌కు చెందిన హితేష్‌ మధుభాయ్‌ పటేల్‌(42)ను హ్యూస్టన్‌లోని ఫెడరల్‌ కోర్టులో హాజరుపరచనున్నారు. అమెరికా వాసుల్ని లక్ష్యంగా చేసుకున్న కాల్‌సెంటర్‌ కుంభకోణం కుట్రలో పటేల్‌పై నేరారోపణలున్నాయి. పటేల్‌ ఓ కాల్‌సెంటర్‌ను నిర్వహించడం ద్వారా అమెరికా పౌరులను మోసం పథకంలో పావులుగా మార్చారని అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ బ్రియాన్‌ తెలిపారు. భారత్‌ నుంచి సింగపూర్‌కు వెళ్లి అక్కడే ఉంటున్న పటేల్‌ను తమ వినతిపై సింగపూర్‌ అధికారులు పట్టుకొని అప్పగిస్తున్నట్లు అమెరికా న్యాయ విభాగం తెలిపింది.