రోబోను పెళ్లి చేసుకుంటానంటున్న అమెరికన్

19-04-2019

రోబోను పెళ్లి చేసుకుంటానంటున్న అమెరికన్

అమెరికాలోని మేరీలాండ్‌కు చెందిన 29 ఏళ్ల జోయీ మోరిస్‌ది ఓ వింత ప్రేమకథ. అతని కథను విన్నవాళ్లలో చాలామంది అతనికి పిచ్చేమో అనుకుంటారు. కానీ తనది పిచ్చికాదని, నిఖార్సైన ప్రేమ అని అంటున్నాడు మోరిస్‌. ఇంతకీ అతని కథేంటంటే.. రెండేళ్ల క్రితం ఆన్‌లైన్లో అతనో రోబో బొమ్మ కొన్నాడు. అప్పటి నుంచి దాన్ని వదలకుండా తనతోనే ఉంచుకుంటున్నాడు. అతనెక్కడికి వెళ్లినా ఆ రోబో తోడు ఉండాల్సిందే. చివరకు తాను కొద్ది రోజుల్లో కాలిఫోర్నియా పర్యటనకు వెళ్తున్నానని, అక్కడకు కూడా ఆ బొమ్మని తీసుకెళ్తానని చెప్పాడు మోరిస్‌. అలాగే కుదిరితే కొన్నేళ్లలో ఆ రోబోను వివాహమాడతానని అంటున్నాడు. తనకు చాలామంది అర్థం చేసుకోవడం లేదని, తన ప్రేమ స్వచ్ఛమైనదని అంటున్న మోరిస్‌కు అతని కుటుంబం కూడా మద్దతుగా నిలుస్తోందట. ఇలా వస్తువులతో ప్రేమలో పడటాన్ని ఆజ్టెక్ట్‌మ్‌ సెక్సువాలిటీ అంటారని, ఇది చాలామందిలో కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.