అమెరికాకు వచ్చిన వెంటనే చంద్రబాబు కంపెనీ ప్రతినిధులతో వరుస భేటీలకు శ్రీకారం చుట్టారు. చాలామంది ఇండియా నుంచి అమెరికాకు వచ్చిన వెంటనే జెట్‌లాగ్‌, టైమ్‌ జోన్‌ వల్ల విశ్రాంతి తీసుకుంటారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వచ్చేలా చేయడం కోసం కంపెనీలతో భేటీకి సిద్ధమైపోయారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సర్వీసెస్‌ సంస్థ ఫ్లెక్‌ట్రానిక్స్‌ ప్రతినిధులతో ఆయన మొదటగా సమావేశమయ్యారు. ఫెక్స్‌ట్రానిక్స్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి మైక్‌ మెక్‌నమరతో జరిగిన తొలిసమావేశం ఉత్సాహంగానే సాగింది. ఆంధ్రప్రదేశ్‌ అన్నీరంగాలకు అనుకూలమైన ప్రదేశమని, ఇక్కడ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆగ్నేయాసియా దేశాల రాకపోకలకు వీలుగా తమ రాష్ట్రం కోస్తాతీరానికి కేంద్రంగా ఉన్న విషయాన్ని తెలిపారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, జల,ఇంధన, మానవ వనరులకు ఎపి నిలయమని చెప్పారు. దేశంలో లాజిస్టిక్‌ హబ్‌గా మారనున్న ఎపిలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన కోరారు.

 

Click here for Photogallery