హ్యూస్టన్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ గ్రేటర్ హ్యూస్టన్ బతుకమ్మ వేడుకులు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక ఇండియా హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 4000 మంది పాల్గొని కోలాటాలు, డాన్స్ లతో బతుకమ్మ ఆడి పాడి ఎంతో భక్తి ప్రబద్దులతో నిమజ్జనం చేసారు. సుమారు 250 బతుకమ్మలని తీసుకొచ్చి పూజలు చేసారు. పిల్లలు, పెద్దలు, వృద్దులు అనే తారతమ్యం లేకుండా బతుకమ్మ డాన్స్ లతో అలరించారు.

ఈ కార్యక్రమము లో హౌస్టన్ లోని కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా డిప్యూటీ కాన్సులర్ జనరల్ సురేంద్ర అదన పాల్గొని కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన సుమారు 100 మంది వాలంటీర్స్ నీ, టాగ్ బోర్డు మెంబెర్స్ కమిటి ని అభినందించారు.

బతుకమ్మలో పాల్గొన్న అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన టాగ్ బోర్డు డైరెక్టర్స్ మరియు ఎగ్జీక్యూటివ్ కమిటీ.

Click here for Event Gallery