ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ముందుకు రావాలని. ముందుకు వచ్చే ఎన్నారైలకు అన్ని విధాల సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐల బహిరంగ సభలో ప్రసంగించారు. పుట్టిన గడ్డను ఎప్పుడూ మరవద్దన్నారు. ఏపీ అభివ ద్ధికి తెలుగు దేశం ప్రభుత్వం నిరంతరం క షి చేస్తున్నానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 58 శాతం పూర్తి అయ్యిందని సీఎం వెల్లడించారు. ఈ ఏడాది మీకు ఓటు వస్తోందని.. ఇక్కడ నుంచే ఓటేయవచ్చని తెలిపారు. 'మీరంతా ఓటు వేయడంతో పాటు టీడీపీకి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని సీఎం పేర్కొన్నారు. దూరం అనేది పెద్ద సమస్య కాదని..మీ గ్రామం కోసం ఆలోచించండని కూడా ఆయన సూచించారు. తమ ఆలోచనలను గ్రామస్థులతో పంచుకోవాలన్నారు. గ్రామదర్శని-వార్డు దర్శనికి  చేయూత కావాలని ఎన్‌ఆర్‌లతో చంద్రబాబు అన్నారు.

సొంత గ్రామానికి ఏం చేయాలో ప్రవాస ఆంధ్రులు ఆలోచించాలని కోరారు. అమెరికాలోని అన్ని నగరాల్లో తెలుగువారు ఉన్నారని... వారంతా అటు వ త్తిలో రాణిస్తూనే.. ఇటు సేవా కార్యక్రమాల్లో ముందుడటాన్ని ప్రశంసించారు. సమాజ సేవలో ముందున్న ప్రవాసాంధులందరికీ అభినందనలు తెలిపారు. ఇటీవలే అమెరికాలో లోకేశ్‌ ఆధ్వర్యంలో తెదేపా మహానాడు బ్రహ్మాండంగా నిర్వహించారని.. అదే స్పూర్తిని ఇకపై కూడా కొనసాగించాలని కోరారు. ఏ పార్టీ వల్ల పైకి వచ్చామో ఆ పార్టీకి ప్రచారం చేయడం అందరి బాధ్యతని సీఎం తెలిపారు. ప్రపంచ దేశాలలో పసుపు జెండా రెపరెపలాడుతుందని ఎవరూ ఊహించలేదన్న చంద్రబాబు.. ఇది ఒక రాజకీయ పార్టీకి దక్కిన అపూర్వ గౌరవంగా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు మీరు మరోసారి కృషి చేయాలని చంద్రబాబు కోరారు. 

ఎన్నారైలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంచి గుర్తింపునిస్తోందని, రవి వేమూరును ఎపిఎన్‌ఆర్‌టీ అధ్యక్షునిగా చేశామని, జయరామ్‌ కోమటి లాంటి వారిని ప్రభుత్వ అడ్వయిజర్‌లుగా నియమించామని చెప్పారు. ఎపిలో ఐటీ ప్లాట్‌ఫామ్‌ ఉంది. దానిని వాడుకుని ఎన్నారైలు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. సమాజసేవలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఎన్నారై టీడిపిలోనూ, ఎపిఎన్‌ఆర్‌టీలోను ఎన్నారైలు సభ్యులుగా చేరాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు బాధ్యతను ఎన్నారై టీడిపి మరోసారి భుజానవేసుకోవాలని కోరారు.

Click here for Photogallery