బే ఏరియాలో పాఠశాల టీచర్ల శిక్షణ తరగతులు

10-09-2018

బే ఏరియాలో పాఠశాల టీచర్ల శిక్షణ తరగతులు

అమెరికాలోని చిన్నారులకు 5 సంవత్సరాలుగా తెలుగు భాషను నేర్పిస్తున్న పాఠశాల సంస్థ ప్రతి సంవత్సరం సిలబస్‌లో వచ్చిన మార్పులు, పిల్లలకు సులువుగా తెలుగు భాషను నేర్పించడానికి అవసరమైన పద్ధతులను తెలియజేసేందుకు పాఠశాల టీచర్లకు శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. బే ఏరియాలోని పాఠశాల టీచర్లకు శిక్షణ తరగతులు ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరికులం డైరెక్టర్‌ కె. గీతామాధవి బోధనలో వచ్చిన మార్పులు, 4 సంవత్సరాల తెలుగు కోర్సులో భాగంగా ప్రవేశపెట్టిన పలుకు, అడుగు, పరుగు, వెలుగు పాఠ్యాంశాలపై టీచర్లకు అవగాహన కల్పించారు. పాఠశాల కొత్తగా ప్రవేశపెట్టిన ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యు పద్ధతిని కూడా ఆమె వివరించారు. ఈ శిక్షణ తరగతులకు పలువురు టీచర్లు, పాఠశాల ఏరియా డైరెక్టర్లు, ఇతరులు హాజరయ్యారు.

Click here for Event Gallery