TANA Curie competitions in Michigan

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), క్యూరీ సంస్థలు కలిసి మిచిగన్‌ లోని డెట్రాయిట్‌ నగరంలో ఏప్రిల్‌ 29న గణితం, సైన్స్‌ మరియు స్పెల్లింగ్‌ బీ విభాగాలలో పోటీలు నిర్వహించాయి. తరగతుల వారీగా నిర్వహించిన ఈ పోటీలకు పద్మభూషణ్‌ ఆచార్య లక్ష్మీ ప్రసాద్‌ యార్లగడ్డ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తానా మిచిగన్‌ ప్రాంత నాయకులు సునీల్‌ పాంత్రా, కిరణ్‌ దుగ్గిరాల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, రవి దొప్పలపూడి, వేణు చిలుకూరి తదితరులు పోటీల నిర్వహణకు కృషి చేశారు. సుమారు 60 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలలో విజేతలకు ట్రోఫీలు తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ శంగవరపు అందజేశారు.