Baking Soda May Help Combat Rheumatoid Arthritis

కీళ్లవాతాన్ని (ఆర్థరైటిస్‌) తగ్గించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. పలు రకాల మందులను వాడుతుంటారు. అయితే కీళ్లవాతాన్ని తగ్గించుకునేందుకు ఇంట్లోనే చక్కటి ఔషధం ఉందంటున్నారు పరిశోధకులు. వంటల్లో వాడే బేకింగ్‌ సోడాను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కీళ్లవాతం వంటి స్వయం ప్రతిరక్షక వ్యాధులను తగ్గించవచ్చని చెబుతున్నారు అమెరికాలోని ఆగస్టా యూనివర్సిటీ పరిశోధకులు. స్వయం  ప్రతిరక్షక వ్యాధులను ఎదుర్కొనేందుకు అవసరమైన శోథ నిరోధక వాతావరణాన్ని బేకింగ్‌ సోడా కల్పిస్తుందని పరిశోధకులు తెలిపారు.