Donald Trump threatens government shutdown in September if no funding from Congress for US Mexico wall

మెక్సికో సరిహద్దుల గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోతే సెప్టెంబర్‌లో ప్రభుత్వం మూతపడిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ను హెచ్చరించారు. వాషింగ్టన్‌, మిచిగాన్‌లలో జరిగిన ర్యాలీలలో ఆయన మాట్లాడుతూ 160 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో ఈ గోడ నిర్మాణ పని ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. సెప్టెంబర్‌ 28న తాను మళ్లీ వస్తానని, అప్పటికి సరిహద్దు గోడ పూర్తి కాకపోతే ప్రభుత్వాన్ని మూసివేయటం తప్ప తమకు మరో మార్గం లేదని ఆయన అన్నారు. దేశానికి సరిహద్దు భద్రత అవసరమని ఆయన సృష్టం చేశారు. దేశంలోకి నేరస్తుల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు వలస చట్టాలలో మార్పులు చేయాల్సిన అవసరం వుందని లేకుంటే ప్రభుత్వం మూతపడుతుందని గత మార్చిలో ట్రంప్‌ ఇదే తరహాలో హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.