గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సంఘం (జిడబ్ల్యుటిసిఎస్‌) ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్‌ 18వ తేదీన ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో 'పాఠశాల' కూడా పాలుపంచుకుంది. తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌, పాఠశాల సీఈఓ సుబ్బారావు ఇందులో పాల్గొని త్వరలోనే ఈ ప్రాంతంలో పాఠశాల ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. వర్జీనియాలో ఈ సంవత్సరం నుంచే పాఠశాల తరగతులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. జిడబ్ల్యుటిసిఎస్‌ సహకారంతో, PRISM విద్యాసంస్థతో తలిసి పాఠశాల తరగతులను నిర్వహిస్తున్నామని సుబ్బారావు వివరించారు. ఏరియా డైరెక్టర్‌గా శ్రీమతి శ్రావ్య బయ్యన వ్యవహరిస్తారని చెప్పారు. యాష్‌బర్న్‌, హెర్న్‌డన్‌, సౌత్‌రైడింగ్‌, ఛాంటెలెలో పాఠశాల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పాఠశాల తరగతుల్లో వర్జీనియాలో ఉన్న తెలుగువాళ్ళు తమ చిన్నారులను చేర్పించాలని ఈ సందర్భంగా చెన్నూరి సుబ్బారావు కోరారు.

తనను ఈ వేడుకలకు ఆహ్వానించిన సంఘం అధ్యక్షుడు సత్య మన్నెకు, తనకు ఆతిధ్యం కల్పించిన తానా అధ్యక్షులు సతీష్‌ వేమనకు సుబ్బారావు ధన్యవాదాలు తెలియజేశారు.

Click here for Event Gallery