Albany Telugu Association Ugadi Celebrations

న్యూయార్క్‌లోని ఆల్బనీ నగరంలో ఉన్న తెలుగువాళ్ళు విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో శ్రీరామనవమి పండుగను కూడా ఉత్సాహంగా చేసుకున్నారు. స్థానిక కొలంబియా ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఉత్సవాలకు సుమారు వేయి మందికి పైగా తెలుగు వారు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా చిన్నారులకు మన సంస్క తీ సంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శ్రీరామ కళ్యాణం థీమ్‌ అందరిని ఆకట్టుకుంది. వచ్చినవారందరికి పానకం వడపప్పు అందజేశారు.

ఉగాది వేడుకలను సాయంత్రం 2 గంటలకు ప్రారంభించారు. ఉగాది ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్క తిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యాంకర్‌ ఉదయభాను వ్యాఖ్యానం, గాయనీ గాయకులు మల్లిఖార్జున్‌, గోపిక పూర్ణిమ పాటలు, జబర్దస్త్‌ ఫేమ్‌ అదిరే అభి చిన్నలతో పెద్దలతో చేయించిన నవ్వుల కామెడీ డాన్సులు, సినీ నటి శ్రీదేవి సినిమాలలోని పాటలకు చేసిన డాన్సులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.  ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీవీ9 సిఇఓ రవి ప్రకాష్‌, తానా మాజీ అధ్యక్షులు మోహన్‌ నన్నపనేని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆల్బనీ చేస్తున్న కార్యక్రమాలను అతిధులు ప్రశంసించారు. సంఘం నాయకులు శ్రీధర్‌ పి, విపుల్‌ నాగుల, ప్రవీన గంటి, కల్యాణ సి కాసిన తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Click here for Event Gallery